తెలంగాణ ఎన్నారై అసోసియేషన్ – TeNA అద్వర్యంలో బోస్టన్ నగరంలోని హాప్కింటన్ స్టేట్ పార్క్ లో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సుమారు మూడవందలకు పైగా తెలంగాణ ప్రజలు హజారైన ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. TeNA కోశాదికారి వేణు మాదాడి,ఉపాధ్యక్షుడు రాజేందర్ కలువల, బోర్డు సభ్యులు శ్రీనివాస్ రావు మేనేని, విజయ్ కాకి ఆద్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. TeNA ఉపాధ్యక్షుడు రాజేందర్ కలువల మాట్లాడుతూ ఈ సంబరాలు చేసుకోవడం చాల ఆనందంగా వుందని రాబోయే రోజుల్లో TeNA ఆద్వర్యంలో మరిన్ని సాంస్కృతిక మరియు సేవ కార్యక్రమాలు చేపడుతామన్నారు. వేణు మాదాడి మాట్లాడుతూ తెలంగాణ సర్వాతోముఖాభివ్రుద్దికి TeNA అన్ని విదాలుగా కృషి చేస్తుందని అన్నారు. అనంతరం చిన్నారులు ఆనందోత్సవాల మధ్య “హ్యాపీ బర్త్ డే టూ యు తెలంగాణ” అని పాడుతూ కేక్ కట్ చేసారు. ఈ కార్యక్రమానికి TeNA సభ్యులు అరవింద్ తక్కలపల్లీ, రామ రావు, శ్రీకుమార్,గోపాల్, బాలాజీ, సంజీవ్, సుదీర్, మధు పురుషోత్తం, పాపా రావు, శ్రీధర్, రమేష్ విజయవంతం చేసారు.